బాలీవుడ్ హీరోలు పలువురు ఓటీటీ బాటపడుతుండగా..సౌత్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో మూవీ కూడా ఓటీటీ విడుదలకు సిద్ధంగా లేరు. ఇదే సమయంలో తెలుగు.. తమిళ హీరోలు వెబ్ సిరీస్ ల్లో నటించడం అంటే తమ స్థాయిని తగ్గించుకోవడం అన్నట్లుగా అభిప్రాయంలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరోలు పలువురు వెబ్ సిరీస్ లు చేస్తుంటే ఇప్పటి వరకు ఎవరు కూడా సౌత్ హీరోలు వెబ్ సిరీస్ లకు ముందుకు రాలేదు. మొదటి సారి […]
కరోనా ప్రభావంతో ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ మిత్రబృందం.. యూవీ క్రియేషన్స్ సంస్థ ఆ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే పూరి జగన్నాథ్, సుజిత్ వంటి స్టార్ డైరెక్టర్లను ఈ సంస్థ సంప్రదించిందట. చాలా మంది యువహీరోలు కూడా వీరి వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం.