Breaking News

WANAPARTHY

‘దారి’ చూపండి సార్లూ..!

‘దారి’ చూపండి సార్లూ..!

సారథి న్యూస్, పెబ్బేర్: రాజకీయ నాయకులు ఆ ఊరు వైపునకు ఓట్లకు తప్ప ఏనాడూ కన్నెత్తిచూడరు. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా పట్టించుకోరు..! వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ఆ ఊరుకు వెళ్లే రోడ్డంతా బురదమయంగా మారింది. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఏనాడూ 108 అంబులెన్స్ ​వచ్చిన దాఖలాల్లేవ్. వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండలం తాటిపాముల పంచాయతీకి మూడు కి.మీ. దూరంలో ఉన్న తాటిపాముల తండా(కుంటివానితండా)కు ప్రధాన రహదారి తెగిపోవడంతో స్థానిక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. […]

Read More
వనపర్తి వాసులు అప్రమత్తంగా ఉండాలి

వనపర్తి వాసులు అప్రమత్తంగా ఉండాలి

సారథి న్యూస్​, వనపర్తి: ఇటీవల భారీవర్షాలకు జిల్లావ్యాప్తంగా వాగులు, చెరువులు, నదులు ప్రమాదకరంగా ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న నేపథ్యంలో ముంపు కాలనీల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి ఎస్పీ అపూర్వరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువు వాగు అలుగు ఉప్పొంగి వరద నీరు శ్రీరామ టాకీస్, శ్వేతానగర్, శంకర్ గంజ్, ప్రభుత్వ ఆస్పత్రి, చింతల హనుమాన్ ఆలయం, సుభాష్ వాడ ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు వచ్చి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రతి పోలీస్​స్టేషన్ […]

Read More
మంత్రి సుడిగాలి పర్యటన

మంత్రి సుడిగాలి పర్యటన

సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా ఘణపురం మండల కేంద్రంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ఆదివారం పర్యటించారు. స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న రైతుబజార్, మాంసం, కూరగాయల మార్కెట్ ను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ కృష్ణనాయక్, జడ్పీటీసీ సభ్యుడు సామ్యా నాయక్, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఉన్నారు.

Read More
లిక్కర్ ఫ్యాక్టరీలో మంటలు

ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీలో మంటలు

వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ సమీపంలో ఉన్న ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో ఉన్న బాయిలర్ ఉన్న చోట పైపులు పగిలిపోవడంతో మంటలు చెలరేగి మంటలు అంటుకున్నాయి. సమీపంలో ఉన్న ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. మిగతా నలుగురిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Read More
WANAPARTHY

ఒకే ఇంట్లో నలుగురు మృతి

సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్​లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. నాగపూర్​కు చెందిన అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా నస్రీన్​ (10) శుక్రవారం తమ ఇంట్లో మృతిచెందారు. ఇంట్లో ఈ నలుగురు విగతజీవులుగా పడిఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వంట గదిలో అజీరాం బీ, హాల్‌లో హాసీనా, డైనింగ్ హాల్‌లో […]

Read More
ఏసీబీకి చిక్కిన పెబ్బేరు తహసీల్దార్​

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

సారథి న్యూస్​, పెబ్బేరు: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. తాజాగా వనపర్తి జిల్లా పెబ్బేరు తహసీల్దార్​ కార్యాలయంలో సూగూర్​ వీఆర్వో రూ. 6,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. సూగూరుకు చెందిన ఆంజనేయులు అనే రైతుకు కొంతకాలంగా అతడి సోదరుల మధ్య భూవివాదం నడుస్తున్నది. వీరి భూసమస్యను పరిష్కరించేందుకు వీఆర్వో లంచం డిమాండ్​ చేశాడు. కాగా, ఆంజనేయులు ఏసీబీని సంప్రదించాడు. రంగంలోకి దిగిన అధికారులు గురువారం […]

Read More
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కంచిరావుపల్లికి మంత్రి గుడ్ ​న్యూస్​

సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ ప్రజలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి గుడ్​న్యూస్​ చెప్పారు. ఆ గ్రామంలో 50 మంది నిరుపేదలకు త్వరలోనే డబుల్​ బెడ్​రూం ఇండ్లు కట్టించి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆగస్టు 1న గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్​ సుజాత తేజవర్ధన్​, ఎంపీటీసీ, రైతు సమన్వయసమితి నాయకులు, టీఆర్​ఎస్​ కార్యకర్తలు, గ్రామప్రజలు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు […]

Read More
సరళాసాగర్ నీటి విడుదల

సరళాసాగర్ నీటి విడుదల

సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి రైతుల పంట పొలాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం సాగునీటిని విడుదల చేశారు. గత డిసెంబర్ 31న ప్రాజెక్టు కట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లడంతో ఫండ్స్​రిలీజ్​ చేయించి యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. రైతులు ఇబ్బందిపడకుండా సాగునీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.

Read More