టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ న్యూఢిల్లీ: ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడమే.. ఐపీఎల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. బ్యాట్స్‌మెన్ స్థాయి నుంచి సారథిగా ఈ ముంబైకర్ ఎదిగిన తీరు చాలా అద్భుతంగా ఉందని కొనియాడాడు. ‘2008 రోహిత్ డెక్కన్ చార్జర్స్‌కు ఆడాడు. అప్పుడు అతనో కుర్రాడు. భారత్ తరఫున టీ20 ప్రపంచకప్ మాత్రమే ఆడాడు. అరంగేట్రం ఐపీఎల్ లో డీసీ […]