సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని స్థానిక కొత్తపేటలో ఏర్పాటుచేసిన వినాయక చవితి వేడుకల్లో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ పాల్గొన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది పండగ కొంత బాధ కలిగిస్తున్నా రేపటి భవిష్యత్ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదన్నారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, నిర్వాహకులు ఉన్నారు.