సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని నేషనల్హైవేల వెంట ఇరువైపులా రంగురంగుల పూల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎర్రమంజిల్ ఆర్అండ్ బీ ఆఫీసులో సమీక్షించారు. రోడ్లకు ఇరువైపులా ఆహ్లాదకరమైన మొక్కలు ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ఆదేశాలు ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర పరిధిలోని నేషనల్ హైవేలపై 50వేల మొక్కలు, 25 కలెక్టరేట్లలో వెయ్యి మొక్కల చొప్పున మొత్తం 75వేల మొక్కలను హరితహారంలో నాటేందుకు ప్రణాళికలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టాలని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనపై సోమవారం హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మోడ్రన్ స్లాటర్ హౌస్ లు నిర్మించాలన్నారు. సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు […]