Breaking News

VANGAPANDU PRASADARAO

వంగపండు ఇకలేరు

ప్రజాగొంతుక మూగబోయింది

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ప్రజాగొంతుక మూగబోయింది. తన పాటలతో ఇరు రాష్ట్రాల ప్రజలను విప్లవోన్ముఖులను చేసిన ఓ తార నింగికెగిసింది. ప్రజాగాయకుడు, విప్లవకవి, ప్రజావాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు (77) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని స్వగ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వంగపండు ప్రసాదరావు 1943లో పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లి గ్రామంలో జన్మించారు. జగన్నాథం, చినతల్లి ఆయన తల్లిదండ్రులు. 1970లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన గిరిజనుల ఉద్యమంలో ఆయన పాట తొలిసారి ప్రాచుర్యం పొందింది. […]

Read More