సారథి, నర్సాపూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసి నాలుగు నెలలు గడిచినప్పటికీ కూలి డబ్బులు రావడం లేదని ఓ కూలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంసాన్పల్లిలో చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికుల కథనం మేరకు.. నాలుగు నెలల క్రితం గ్రామానికి చెందిన కూలీలు ఒర్రె లక్ష్మయ్య, దుంపల నరసింహులుతో పాటు మరికొందరు ఉపాధి పనులు చేశారు. పనిచేసి నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో ఎంపీడీవోకు విన్నవించారు. అయినప్పటికీ […]