సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీశైలం పాతాళగంగ ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం మరోసారి మంటలు చెలరేగాయి. బతుకుజీవుడా అంటూ సిబ్బంది పరుగులు తీశారు. కరెంట్ కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది చెప్పారు. అయితే ప్రమాద తీవ్రతను అధికారులు పరిశీలిస్తున్నారు. లాన్‌కు ఎలాంటి ప్రమాదం లేదని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనతో జెన్కో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హతాశులయ్యారు. పొగలు కమ్ముకుంటుండడంతో […]
సారథి న్యూస్, హైదరాబాద్: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలోకి బయట నుంచి వాటర్ వచ్చే అవకాశమే లేదని జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఈనెల 20న వపర్హౌస్లో జరిగిన ప్రమాదంపై విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు ఇంజనీర్లు, ఇద్దరు ఒక బ్యాటరీ కంపెనీ ప్రతినిధులు మరణించడం చాలా బాధాకరమన్నారు. అగ్నిప్రమాదం సమయంలో యూనిట్స్ ట్రిప్ కావలసి ఉంటుంది.. కానీ ఎందుకు ఆటోమేటిక్ గా ట్రిప్ కాలేదో విచారణ […]
సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టీఎస్ జెన్ కో విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్‌లోని ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం సంభవించి మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. జీరో లెవెల్ నుంచి సర్వీస్ బే వరకు మంటలు వ్యాపించాయి. ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. […]