సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వీఆర్ఎస్ తీసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిస్తానని సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ కావడంతో ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్ సోమేశ్‌కుమార్‌కు పంపించగా ఆయన ఆమోదించారు. ఇదిలాఉండగా, కొద్దిసేపటల్లో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. 1996లో డిప్యూటీ కలెక్టర్ కేడర్‌లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఉమ్మడి […]