సారథి న్యూస్, పెద్దశంకరంపేట: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు పెద్దశంకరంపేట మండలంలో విశేష స్పందన లభిస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పుస్తకాలతో పాటు నగదును పార్టీ మండలాధ్యక్షుడు మురళి పంతులు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి అందజేశారు. మండలంలో దాదాపు ఐదువేలకు పైగా సభ్యత్వ నమోదు చేశామని, అందులో ఇప్పటివరకు 2500 సభ్యత్వాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు ఎమ్మెల్యేకు వివరించారు. […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మండలంలోని జంబికుంట, కమలాపూర్, చీలపల్లి, గ్రామాల్లో మంగళవారం టీఆర్ఎస్పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండలాధ్యక్షుడు మురళిపంతులు, ఎంపీపీ జంగం శ్రీనన్న, కిషన్, సర్పంచ్ లు కుంట్ల రాములు, సాయిలు, ప్రకాష్, ఎంపీటీసీ సభ్యుడు దామోదర్, సహకార సంఘం చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాణిక్ రెడ్డి, అంజిరెడ్డి, పాండు, శంకరయ్య, భూమిరెడ్డి, రోశిరెడ్డి, లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి, అశోక్, సాయిరెడ్డి, మాణిక్యం, చీలపల్లి ఉపసర్పంచ్ పాల్గొన్నారు.