సారథి న్యూస్, ఖమ్మం: ఆదివాసీలకు ఎల్లప్పుడూ అండగా ఉండి, వారి హక్కులను పరిరక్షిస్తామని భారత మానవహక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తురకలగూడెం గ్రామంలో గురువారం మానవహక్కుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గిరిజనలకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారి ఇండ్లను పరిశీలించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల బాగోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.