Breaking News

TRIBALWALFARE

విద్యార్థులు ఆ మూడు సూత్రాలు పాటించాలి

విద్యార్థులు ఆ మూడు సూత్రాలు పాటించాలే

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: విద్యార్థులు వినయం, విజ్ఞానం, ఆరోగ్యం వంటి మూడు సూత్రాలను పాటించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయలక్ష్మి సూచించారు. శనివారం ఆమె స్థానిక ఎస్టీ హాస్టల్ ను తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌష్టికాహారం అందజేయడంతో పాటు, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read More