సామాజిక సారథి, మహబూబాబాద్: తక్కలపల్లి రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవి రావడంతో ఆయన అనుచరులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం అనుచరుడు పుచ్చకాయల రామకృష్ణ మాట్లాడుతూ మానుకోట ముద్దుబిడ్డ, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు రవీందర్ రావు ఎమ్మెల్సీ పదవి రావడం సంతోషకరమన్నారు. రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవొస్తే అనంతాద్రి వెంకటేశ్వర స్వామి వారికి 101కొబ్బరి కాయలతో మొక్కు చెల్లించుకుంటామని మొక్కినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ వచ్చిన సందర్భంగా 101 కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. […]