Breaking News

TENNIS

జొకోవిచ్​కు కరోనా నెగిటివ్

జొకోవిచ్​కు కరోనా నెగిటివ్

బెలెగ్రేడ్​: పది రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ప్రపంచ నంబర్​వన్​ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్, అతని భార్య జలెనా పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు అతని మీడియా బృందం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పరీక్షల నివేదికలను బహిర్గతం చేసింది. సెర్బియా, క్రొయేషియాలో నిర్వహించిన ఆడ్రియా టూర్ ఆఫ్ ఎగ్జిబిషన్ టోర్నీ సందర్భంగా జొకో వైరస్ బారినపడ్డాడు. అప్పటినుంచి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కరోనా లక్షణాలు లేకపోయినా జొకో మరికొద్ది […]

Read More

దిమిత్రోవ్, కొరిచ్​కు కరోనా

క్రొయేషియా: టెన్నిస్ క్రీడలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. గత వారం నిర్వహించిన ఏడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్న గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), బోర్నా కొరిచ్ (క్రొయేషియా)లకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ టోర్నీలో ఆడిన ప్లేయర్లకు వైరస్ భయం పట్టుకుంది. అలాగే మ్యాచ్​కు హాజరైన నాలుగు వేల మంది ప్రేక్షకుల్లో కూడా ఆందోళన మొదలైంది. ప్రపంచ నంబర్​వన్​ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ ఈ టోర్నీని ఏర్పాటు చేయడంతో అతనిపై విమర్శలు మొదలయ్యాయి. […]

Read More

టెన్నిస్​ దిగ్గజం ఆష్లే కూపర్​ మృతి

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా టెన్నిస్​ దిగ్గజం ఆష్లే కూపర్ (86) శనివారం అనారోగ్యంతో మరణించారు. 1958లో ఆస్ట్రేలియన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్స్​ను సొంతం చేసుకున్న కూపర్​ నంబర్‌ వన్‌ ర్యాంక్‌లోనూ నిలిచాడు. 1957లో ఆస్ట్రేలియా టీమ్‌ డేవిస్‌ కప్‌ను నిలబెట్టుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. వెన్ను నొప్పి కారణంగా 1959లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన కూపర్‌.. ఆ తర్వాత బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. టెన్నిస్‌ అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగాడు. ‘ప్లేయర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా కూపర్‌ అద్భుతమైన పాత్ర పోషించాడు. […]

Read More