శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు బుధవారం ఉదయం సాక్షి గణపతిస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో పూజలు చేశారు. తర్వాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విద్యార్థుల్లో ఆలోచనా […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శుక్రవారం నుంచి దర్శనాలను ప్రారంభించినట్టు దేవస్థాన ఈవో కేఎస్ రామారావు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆలయానికి రావొద్దని సూచించారు. క్యూలైన్లలో సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. శుక్రవారం స్థానికులకు దర్శనాలకు అవకాశం కల్పించామని.. శనివారం నుంచి దూరప్రాంతాల వారు రావొచ్చని సూచించారు. ఆలయసిబ్బందికి కరోనా రావడంతో కొంతకాలం క్రితం దర్శనాలను నిలిపివేశారు.