Breaking News

TELANGANA

ఆయుష్మాన్ భారత్ లోకి తెలంగాణ

ఆయుష్మాన్ భారత్ లోకి తెలంగాణ

సారథి ప్రతినిధి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంవోయూ కుదుర్చుకున్నది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారుచేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ  వైద్యసేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ […]

Read More
కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్

కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్

సారథి, వనపర్తి: కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. గురువారం పెబ్బేరులో కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, జిల్లా ఆస్పత్రి, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. డాక్టర్ల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ అభినందనలు తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఐసొలేషన్ లో ఉంచితే ఇబ్బంది ఉండదని, ఇంటింటి సర్వేలో జ్వరపీడితులను గుర్తించి […]

Read More
లాక్‌డౌన్‌ గైడ్‌లైన్స్‌ ఇవే

లాక్‌డౌన్‌ గైడ్‌లైన్స్‌ ఇవే

సారథి, హైదరాబాద్​: కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మే 12 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యవసాయం, మీడియా, విద్యుత్‌ రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఆఫీసులన్నీ 33 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయి. రవాణా విషయానికి వస్తే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. సిటీబస్సులు, జిల్లా సర్వీసులు కూడా […]

Read More
లాక్​డౌన్.. మద్యం ప్రియులు ఏంచేశారో తెలుసా?

లాక్​డౌన్.. మద్యం ప్రియులు ఏంచేశారో తెలుసా?

వైన్స్​ముందు గంటలకొద్దీ క్యూ లైన్​ కాటన్లు కాటన్లు మద్యం బయటకు.. భౌతికదూరం పాటించని వైనం కరోనా ఎవరికి అంటుకుంటుందోనని టెన్షన్​ సారథి, మానవపాడు/రామడుగు/వనపర్తి: ఈనెల 12(బుధవారం) నుంచి తెలంగాణలో లాక్​డౌన్​ ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మందు బాబులు మద్యం షాపులకు క్యూ కట్టారు. ఇక మద్యం దొరకదు కావొచ్చు అనుకున్నారేమో పరుగెత్తి దక్కించుకున్నారు. ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు సాగుతూ బాటిళ్లను కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, అలంపూర్ చొరస్తా, శాంతినగర్, అయిజ, ఇటిక్యాల చొరస్తా […]

Read More
భీమవరంలో పుట్ట మధు అరెస్ట్​

భీమవరంలో పుట్ట మధు అరెస్ట్​

సారథి, కరీంనగర్: పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధునుపశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు శనివారం అరెస్ట్ ​చేశారు. కొద్దిరోజులుగా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కు పుట్ట మధుతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు వ్యాపార లావేదేవీలు నిర్వహించారని సమాచారం. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పుట్ట మధుపైనా సీఎం కేసిఆర్ తీవ్ర […]

Read More
రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

సారథి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర  ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. మొదట్లో మే 8వ తేదీ వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరోవారం పాటు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ […]

Read More
ప్రభుత్వానికి ‘జైభీమ్​యూత్’​ విజ్ఞప్తి

ప్రభుత్వానికి ‘జైభీమ్​ యూత్’​ విజ్ఞప్తి

సారథి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ అన్ని కార్పొరేట్​ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించాలని జైభీమ్​యూత్​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సెకండ్​వేవ్​తీవ్రతలో జనం పిట్టల్లా రాలిపోతున్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటివేషన్​సరిపడా దొరకడం లేదని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో కొవిడ్​రోగుల ప్రాణాలు నిలిపే రెమిడెసివర్​ఇంజక్షన్ల కొరత తీవ్రత ఉందని, బ్లాక్ మార్కెట్​ దందాపై ఉక్కుపాదం […]

Read More
ఈటల వెంటే నడుస్తాం

ఈటల వెంటే నడుస్తాం..

ముదిరాజ్ సంఘం జిల్లా యువ నాయకుడు హరికృష్ణ సారథి, బిజినేపల్లి: మాజీమంత్రి, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కు తెలంగాణ ముదిరాజ్ మహాసభ అండగా నిలుస్తుందని సంఘం జిల్లా నాయకులు హరికృష్ణ ముదిరాజ్ తెలిపారు. గురువారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాగర్ కర్నూల్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ఈటలను కలిశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ను కక్ష సాధింపుతో మంత్రివర్గం నుంచి తొలగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన […]

Read More