Breaking News

TELANGANA

దంచికొడుతున్న వాన

దంచికొడుతున్న వాన

ఏకమైన వాగులు, వంకలు.. నిండుకుండలా చెరువులు, కుంటలు లోతట్టు ప్రాంతాలు జలమయం పలుచోట్ల వాగుల్లో కొట్టుకుపోయినవారిని కాపాడిన పోలీసులు సారథి ప్రతినిధి, జగిత్యాల/జగిత్యాల రూరల్/వేములవాడ/పెద్దశంకరంపేట/నాగర్​కర్నూల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణమ్మ, గోదావరి నదుల్లోకి నీటి ఉధృతి పెరిగింది. రెండు రోజులుగా ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కుండపోత వర్షాలకు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతరం- గుల్లపేటవాగు పైనుంచి వెళ్తుండగా వరద ఉధృతికి కారు […]

Read More
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

సారథి, చొప్పదండి: అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చొప్పదండి తహసీల్దార్ ఆఫీసు ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి […]

Read More
ఏపీ జలదోపిడీపై ఊరుకునేదే లేదు

ఏపీ జలదోపిడీపై ఊరుకునేదే లేదు

సారథి, అచ్చంపేట: ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తే ఊరుకునేది లేదని, జలదోపిడీపై అక్కడే పాతరేస్తామని నాగర్ కర్నూల్​జిల్లా అచ్చంపేట జడ్పీటీసీ సభ్యుడు మంత్రియ నాయక్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ సైంధవపాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర హక్కులకు విరుద్ధంగా కృష్ణా బేసిన్‌లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వబోమని ఘాటుగా హెచ్చరించారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా కేంద్రప్రభుత్వం చోద్యం […]

Read More
కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వరం

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వరం

సారథి, కోడిమ్యాల: కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరమని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్​అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో రూ.79,84,280 విలువైన కళ్యాణలక్ష్మీ చెక్కులను 80 మంది లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని కొనియాడారు. ప్రతిఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ […]

Read More
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళాజాతా

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళాజాతా

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని కొత్తపేట, రామోజీపల్లి గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా కోఆర్డినేటర్​కొమ్ముల శేఖర్ గౌడ్, నాగరాజు, సాయిలు, శ్రీనివాస్, మదన్, మాధవి, రవీందర్, రాజు నాయక్ కళాజాతా నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, కరోనా వ్యాప్తిపై జాగ్రత్తలు, సూచనలు, వ్యాక్సినేషన్, మాస్క్ ప్రాధాన్యత, ఆరోగ్యం, హరితహారం, పల్లెప్రగతి, నూతన వ్యవసాయ పద్ధతులపై తమ ఆటాపాటల ద్వారా గ్రామస్తులకు […]

Read More
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు

పెండింగ్ అప్లికేషన్లను పరిశీలించండి అద్దె ఇళ్లల్లో ఉన్నవారికీ కార్డులు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల భర్తీ తండాలు పంచాయతీగా మారిన చోట సబ్ డీలర్ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సారథి ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్రంలో అర్హులైన అందరికీ పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులను జారీచేయాలని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సూచించిన విధంగా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను రెవెన్యూ, […]

Read More
ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారు

ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారు

సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు సారథి, జగిత్యాల: రాష్ట్రంలో అదనపు కలెక్టర్లకు కియో వాహనాలు, పోలీసులకు ఇన్నోవాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారని మాజీమంత్రి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫాంహౌస్ పై విచారణకు ఆదేశించాలని, నిబంధనల ప్రకారం ఉంటే దానిపై కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. […]

Read More
పేదలకు చెంతనే మెరుగైన వైద్యసేవలు

పేదలకు చెంతనే మెరుగైన వైద్యసేవలు

సారథి, మానవపాడు(గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రాష్ట్రప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు బుధవారం ప్రారంభించారు. పేదలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని కోరారు. సర్కారు దవాఖానల్లో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కరోనాకు మెరుగైన వైద్యచికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ శృతిఓఝా, ఎస్పీ రంజన్ రతన్ కుమార్, డీఎంహెచ్ వో […]

Read More