సారథి, ములుగు: తెలంగాణలో మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా తప్పదని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య హెచ్చరించారు. ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్నిబంధన ఉత్తర్వులను వివరించారు. కరోనా నివారణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, వ్యక్తిగత దూరం పాటించాలని, తరచూ శానిటైజర్ ఉపయోగించాలని కలెక్టర్సూచించారు.