సారథిన్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కొత్తగా ఓ ఐరన్ బ్రిడ్జిని పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేశారు. శుక్రవారం రాష్ట్ర మంత్రుల తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ ఐరన్ దీన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కార్పొరేటర్ కవితారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్ : పేద ప్రజలు అన్ని వసతులతో సొంత ఇంట్లో సంతోషంగా ఉండటమే సీఎం కేసీఆర్ ఉద్దేశ్యమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని బజ్జు గుట్టలో రూ. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై శుక్రవారం సమీక్షించారు. ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7.75 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్ బొంతు రామ్మోహన్, వివిధ శాఖల […]
సారథి న్యూస్, హైదరాబాద్: వందేళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు త్వరలోనే కొత్త అందాలను సంతరించుకుంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం రైల్వే స్టేషన్ ఎదుట రూ.30కోట్ల వ్యయంతో నిర్మింనున్న ఫుట్ పాత్ లు, బస్ షెల్టర్లు, రోడ్ల పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఏడాదిలోగా అన్ని పనులను పూర్తిచేయనున్నట్లు తెలిపారు.
సారథి న్యూస్, మెదక్: సీఎం కేసీఆర్ రైతులకు ఆపద్భాండవుడని, రైతుబిడ్డగా రైతులు పడే కష్టాలన్ని విషయాలు ఆయనకు తెలుసునని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్ కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.12వేల కోట్ల రుణమాఫీ చేసి 53 వేలమంది రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏదో మాట్లాడారు… కొండపోచమ్మ సాగర్ ను చూసి […]
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరు ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితులను సినీరంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. షూటింగ్‌లకు అనుమతులపై పరిశీలిస్తున్నామని, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గురువారం ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్ రాజు, […]