వచ్చే ఏడాదికి సిద్ధమన్న సీఏ మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగడం కష్టమే. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే మెగా ఈవెంట్‌ను వాయిదా వేయడం ఖాయమేనని స్పష్టమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించలేమని సీఏ సీఈవో కెవిన్ రాబర్ట్స్ సంకేతాలిచ్చాడు. కరోనా, ప్రయాణ నిషేధం వల్ల ఈ ఏడాది టోర్నీ జరగడం కష్టమేనని తేల్చేశాడు. ‘ఒకవేళ ధైర్యంగా ముందుకెళ్లినా.. టోర్నీ నిర్వహణలో చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. […]