సారథి న్యూస్, హుస్నాబాద్ : కరోనా రోగులకు వైద్యం అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్డౌన్ను సడలించడంతో కరోనా విజృంభిస్తుందన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా టెస్టులసంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.