ఆర్జీవీకి కౌంటర్‌గా పవన్‌కల్యాణ్ అభిమాని, బిగ్‌బాస్ ఫేం నూతన్‌నాయుడు పరాన్నజీవి అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం అతడు వివాదస్పద నటి శ్రీరెడ్డిని అప్రోచ్ అయ్యాడట. అందుకు ఆమె నో చెప్పినట్టు సమాచారం. శ్రీరెడ్డి అంతకుముందే పలుమార్లు పవన్‌కల్యాణ్‌పై నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పవన్‌కల్యాన్ అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పరాన్నజీవి చిత్రంలోనూ తన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటంతోనే ఆమె నటించేందుకు ఒప్పుకోలేదని టాక్. కాగా […]