సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు దివంగత కాసోజు శ్రీకాంతచారి 11వ వర్ధంతి సందర్భంగా మోత్కూరు మండలం పొడి చెడు గ్రామంలో ఆయన విగ్రహానికి మంత్రులు ఈటల రాజేందర్, గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.