సారథి న్యూస్, అలంపూర్ (జోగుళాంబ గద్వాల): ఈనెల 20వ తేదీ నుంచి జరిగే తుంగభద్ర నది పుష్కరాల నేపథ్యంలో ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ సోమవారం అలంపూర్ లోని పుష్కర ఘాట్ ను, జోగుళాంబ ఆలయాల సముదాయాన్ని సందర్శించారు. పుష్కర ఘాట్ ప్రాంతంలో వీఐపీ పార్కింగ్, సాధారణ భక్తుల వాహనాలకు పార్కింగ్, అలాగే వృద్ధులు, దివ్యాంగులకు కల్పించే ఉచిత పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అమ్మవారి ఆలయం, స్వామివారి ఆలయంలోకి వచ్చే మార్గాలు, బయటకు వెళ్లే మార్గాలను గుర్తించి […]