సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: క్రమశిక్షణతో ఉంటూ స్టేషన్ కు వచ్చే బాధితులను గౌరవిస్తూ పోలీస్ శాఖకు మరింత మంచిపేరు తీసుకురావాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై మరింత పట్టు సాధించాలని కోరారు. 9నెలల ట్రైనింగ్ అనంతరం జిల్లా పోలీసు డిపార్ట్మెంట్లో విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జమ్మిచెడులోని సీఎన్జీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్పీ పలు సూచనలు […]