Breaking News

SOMU VERRAJU

సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ పగ్గాలు

సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ పగ్గాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు సోమవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తప్పించింది. సోము వీర్రాజు స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా కత్తెరు గ్రామం. ఆయన ఎంతోకాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీ పట్ల విధేయతగా పనిచేస్తున్న ఆయనకే బాధ్యతలను కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

Read More