ఢిల్లీ: పొగ తాగేవళ్లకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. సిగరేట్లు ద్వారా కరోనాకు వాహకాలుగా పనిచేస్తాయని పేర్కొన్నది. సిగరేట్ అమ్మే వ్యక్తికి కరోనా ఉంటే.. అవి కొని తాగేవారికి వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వారు సిగరెట్‌ను తమ చేతితో తాకుతారు అనంతరం పెదవులతో కూడా తాకుతారు. దీంతో కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. […]