Breaking News

SHADIMUBHARAKH

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసా

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసా

సారథి న్యూస్, కరీమాబాద్(ఖిల్లావరంగల్): పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలుస్తాయని కార్పొరేటర్ దామోదర్ యాదవ్ అన్నారు. ఆదివారం నగరంలోని 8వ డివిజన్​లో 26మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పేదల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్​ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలంతా సీఎం, తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్​ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బోగి సురేష్, లబ్ధిదారుల కుటుంబాలు పాల్గొన్నాయి.

Read More