సారథి న్యూస్, అలంపూర్(మానవపాడు): తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ స్థలం నుంచి జోగుళాంబ ఆలయం వరకు ఉచిత బస్సు సర్వీసును అలంపూర్ మున్సిపాలిటీ వారు, జోగుళాంబ ఆలయం ట్రస్ట్ బోర్డు వారు కలిసి సంయుక్తంగా మంగళవారం ఏర్పాటుచేశారు. సెట్వీన్ బస్సు సర్వీసులను మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్, టెంపుల్ బోర్డ్ చైర్మన్ రవిప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శేఖర్ […]