సారథి, వెంకటాపూర్: ఆదివాసీ గిరిజన తండావాసులకు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్, ఫౌండేషన్ అండగా నిలిచింది. ఇండ్లు కాలిపోయి సర్వం కోల్పోయిన గొత్తికోయలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. విద్య, వైద్యంతో పాటు కనీస సౌకర్యాలు పొందాలంటే గ్రామాలకు దగ్గరగా నివాసాలను ఏర్పాటు చేయాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. రెండు రోజుల క్రితం బూర్గుపేట పరిధిలోని సకారిరేవులు గొత్తికోయగూడెం వాసుల ఇండ్లు కాలిపోయాయి. తినడానికి తిండిలేక దిక్కుతోచని స్థితిలో బాధితులు ములుగు, […]