సారథి న్యూస్, రామడుగు: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా కారణంగా విద్యావ్యవస్థ సమూలంగా దెబ్బతిన్నది. దీంతో విద్యార్థుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారింది. ఈ తరుణంలో పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు హోమ్ ట్యూషన్ ను ఆశ్రయిస్తున్నారు. అందులో భాగంగానే రామడుగు మండల కేంద్రంలో పిల్లలను హోమ్ ట్యూషన్ పంపించే క్రమంలో రోడ్డు దాటించడం ఇబ్బందిగా మారడం, సరైన సమయంలో పేరెంట్స్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల వద్దకే ఉపాధ్యాయులు స్వయంగా వచ్చి పాఠాలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 15 నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు, 22 నుంచి ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి చిత్రారామచంద్రన్ కు లేఖ రాశారు. ఈనెల మొదటి 1 నుంచి 9, 10 ఆపై తరగతులు ప్రారంభమై సజావుగా కొనసాగుతున్నాయని వివరించారు. పొరుగు రాష్ట్రంలో కూడా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9వ తరగతి.. ఆపై క్లాసెస్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ సలహాదారులు, ఆయాశాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. […]