సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రులుగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉత్తమ సేవలు అందించి ప్రజల అభిమానం చూరగొనాలని సీఎం ఆకాంక్షించారు.