సామాజిక సారథి, ఆమనగల్లు: అంగరంగవైభవంగా సదర్ సమ్మేళనం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదర్ సమ్మేళనం ఉత్సవాలు మొట్టమొదటి సారిగా ఆమనగల్లు పట్టణంలో ఇంత బ్రహ్మడంగా, కనుల పండుగా నిర్వహించిన యాదవ సోదరులను అభినందించారు. నరకాసురుని వధించిన దానికి ప్రతీకగా సదర్ సమ్మేళనం నిర్వహిస్తారని అన్నారు. ఇదే విధంగా ఆమనగల్లు కూడా అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని, 15రోజుల్లో అభివృద్ది పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో […]