రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో గురువారం సాయంత్రం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. చింతూరు సమీపంలోని శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ నీటిలో మునిగిపోయింది. కల్లేరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.లాంచీ సిబ్బంది రాంబాబు, సత్తిబాబు, పెంటయ్య నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న మరో లాంచీ సిబ్బంది ఇద్దరినీ రక్షించారు. వీరిలో పెంటయ్య కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గోదావరి లాంచీ సిబ్బంది మాత్రమే ఉండడంతో ఘోర ప్రమాదం తప్పినట్లయింది.