న్యూఢిల్లీ: వన్డేల్లో ఫలితం తేల్చడానికి సూపర్ ఓవర్ ఎందుకు వేయించాలని న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ టై అయితే ట్రోఫీని ఇరుజట్లకు పంచండని సూచించాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను దృష్టిలో పెట్టుకుని టేలర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో సూపర్ ఓవర్ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మ్యాచ్ టై అయితే దానిని టైగానే పరిగణించాలి. వేగంగా పరిస్థితులు మారే టీ20ల్లో ఇది కుదరకపోవచ్చు. […]