వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోరోనా బారినపడ్డారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడి విషయం తెలిసిందే. వారంతా కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సపొంది కోలుకున్నారు.