సారథి న్యూస్, మెదక్: కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడానికి రైస్ మిల్లర్లు అదనపు హమాలీలను సమకూర్చుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు. బుధవారం హవేలీ ఘనపురం మండల కేంద్రంతో పాటు రామాయంపేట మండలాల్లోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు తరలిస్తున్న ధాన్యం ఆయా మిల్లు వద్ద దిగుమతి కాకుండా అలాగే ఉంటునట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. […]