న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన రికార్డును సాధించారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన ఖ్యాతిని గడించారు. వాజపేయి కాంగ్రెసేతర ప్రధానిగా 2,268 రోజులు కొనసాగారు. కాగా, గురువారంతో ప్రధాని మోడీ ఆ రికార్డును అధిగమించారు. ఈ మేరకు బీజేపీ సోషల్మీడియా జాతీయవిభాగం ఇంచార్జి ప్రీతీ గాంధీ ట్వీట్ చేశారు. ఇక సుదీర్ఘకాలం పదవిలో ఉన్న వారిలో మోదీ నాలుగో స్థానానికి చేరారు. తొలి మూడు స్థానాల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 10 లక్షల మార్క్ దాటింది. 24 గంటల్లో 36,247 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,004,652కి చేరింది. ఒక్క రోజులో 690 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 25,594కి చేరింది. ఒక్కరోజులో ఇన్ని మరణాలు నమోదవ్వడం ఇదే. 10లక్షల కేసుల్లో 3,43,268 యాక్టివ్ కేసులు కాగా.. 6,35,790 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అమెరికాలో 3,648,250 […]