సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి): గిరిజన యువతిపై అత్యాచారం జరిగిన ఘటనపై గవర్నర్ స్పందించాలని ఎరుకల అభివృద్ధి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కండెల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సురాబాద్ డివిజన్, నాంచారమ్మ బస్తీలో ఎరుకల అభివృద్ధి సేవా సంఘం అధ్యర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. గిరిజన యువతిపై 139 మంది అత్యాచారం చేసిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహిళపై లైంగికదాడి చేసిన […]