సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా నారాయణపుర్ రిజర్వాయర్ ను బుధవారం టీడీపీ బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ.. నారాయణపూర్ రిజర్వాయర్ నింపి రైతులను ఆదుకోవాలని.. భూములు , ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి జంగం అంజయ్య, నేతలు కరుణాకర్‌రెడ్డి, జెల్లోజి శ్రీనివాస్, పూరెల్ల గంగరాజుగౌడ్, అనుపురం వెంకటేశ్‌గౌడ్, భూపతి తదితరులు పాల్గొన్నారు.