సామాజిక సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పార్వతి సమీత రాజరాజేశ్వరి స్వామివారిని శుక్రవారం సిద్దిపేట ట్రెయిని అసిస్టెంట్ కలెక్టర్ ఫ్రూఫ్ దేశాయి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదొక్తంగా ఆశీర్వచనాలు అందించారు. ఏఈవో ప్రతాప నవీన్ కండువా కప్పి సన్మానించి లడ్డూప్రసాదం అందజేశారు.
సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యుడు కారం రవీందర్రెడ్డి, కరీంనగర్ టీఎన్జీవో ప్రెసిడెంట్ మారం జగదీశ్ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు నాగిరెడ్డి మండపంలో సాదరంగా ఆహ్వానం పలికి వేదోక్తంగా ఆశీర్వచనాలు అందించారు. పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు శాలువాతో సత్కారించి సన్మానించారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా టీఎన్జీవో ప్రెసిడెంట్ తో పాటు ఏఈవో […]
సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటలకు కౌంటింగ్చేశారు. ఆలయానికి రూ.1.2 కోట్ల ఆదాయం సమకూరింది. 198 గ్రాముల బంగారం, 11 కిలోలన్నర వెండి వచ్చింది. ఈ లెక్కింపు ప్రక్రియ ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ ఆధ్వర్యంలో కొనసాగింది.
సారథి, వేములవాడ: దక్షిణకాశీ క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని తొగుట పీఠం శ్రీశ్రీశ్రీ మాధవానందస్వామి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. స్వామి వారికి పూజల అనంతరం కల్యాణమండపంలో పాదపూజ చేశారు. వారి వెంట బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, అర్చకస్వాములు పాల్గొన్నారు. అలాగే ఒకేరోజు సుమారు 25వేల మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆలయానికి రూ.20లక్షల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.