జైపూర్: రాజస్థాన్‌లోని రాజకీయ నాయకుల ఫోన్‌లను కాంగ్రెస్ ట్యాప్ చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఆడియో టేప్‌లు బయటికి రావడంపై సీబీఐ విచారణ జరిపించాలని కమలం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ చట్టపరమైన సమస్య కాదా? ఫోన్ ట్యాపింగ్‌కు నిర్దేశిత ప్రామాణిక విధానాలు ఉన్నాయా? రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై సీఎం అశోక్ గెహ్లాట్ సమాధానం చెప్పాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఫోన్ […]