సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన రాజన్నసిరిసిల్ల వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. శాలువతో సత్కారించి లడ్డూప్రసాదం అందజేశారు.వైద్యాధికారి మహేష్ రావుకు రాజన్న ప్రసాదంరాజన్న ఆలయ ఉద్యోగులు కరోనా బారినపడకుండా ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు త్వరితగతిన వాక్సిన్ ఇచ్చినందుకు 100 పడకల ఆస్పత్రి వైద్యాధికారి ఆర్.మహేష్ రావుకు యూనియన్ అధ్యక్షుడు […]