Breaking News

RAJANNASIRICILLA

రాజన్న సన్నిధిలో ప్రముఖులు

రాజన్న సన్నిధిలో ప్రముఖులు

సారథి, వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని సినీనేపథ్య గాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సాదరస్వాగతం పలికారు. శాలువతో సన్మానం చేసి స్వామి వారి అభిషేకం లడ్డూప్రసాదంతో పాటు స్వామివారి ప్రతిమలను అందజేశారు. అంతకుముందు పట్టణంలోని సాయిబాబా ఆలయాన్ని ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు.

Read More
గీత దాటితే చర్యలు తప్పవు: ఎస్పీ

గీత దాటితే చర్యలు తప్పవు: ఎస్పీ

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో వేములవాడ- తిప్పాపూర్ బస్టాండ్ సమీపంలో వాహనాలను తనిఖీచేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి పది గంటల తర్వాత రోడ్లపై తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన పది షాపుల యజమానులపై చర్యలు తీసుకున్నారు. ఆయన […]

Read More
వంద పడకల ఆస్పత్రిలో సదుపాయాల పరిశీలన

వంద పడకల ఆస్పత్రిలో సదుపాయాల పరిశీలన

సారథి, వేములవాడ: వంద పడకల ఆస్పత్రి సముదాయం చుట్టూ పరిసరాలను చదును చేసి శుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. సోమవారం ఆయన వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని వంద పడకల ఆస్పత్రి సముదాయాన్ని పరిశీలించారు. ఐసీయూ, సాధారణ వార్డుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన పరికరాలు త్వరలోనే తీసుకొస్తామన్నారు. విద్యుత్ సదుపాయంతో సహా ఇతర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కలెక్టర్ వెంట డాక్టర్​ మహేశ్​ రావు, తదితరులు ఉన్నారు.

Read More
మల్కపేట ప్యాకేజీ- 9 పనులను కంప్లీట్​చేయాలే

మల్కపేట ప్యాకేజీ- 9 పనులను కంప్లీట్​ చేయాలే

సారథి న్యూస్​, రాజన్న సిరిసిల్ల: మల్కపేట ప్యాకేజీ- 9 పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. టన్నెల్ లో ప్రతిరోజు సుమారు 80 మీటర్ల మేర లైనింగ్ పనులు చేసేలా చూడాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీ 9 పనులపై శనివారం ఆమె సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా చూడాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. టన్నెల్ లో సుమారు 80 మీటర్ల మేర లైనింగ్ […]

Read More