టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడకుండా.. జీవ రక్షణ వాతావరణంలో (బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్) క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం అసాధ్యమని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఇందంతా ఓ మిథ్య అని కొట్టిపడేశాడు. ఆట రెండవ రోజు ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే ఏం చేస్తారని ప్రశ్నించాడు. పాకిస్థాన్, వెస్టిండిస్ తో జరిగే సిరీస్లను బయోసెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తామని ఈసీబీ ప్రకటించిన నేపథ్యంలో ద్రవిడ్ పైవిధంగా స్పందించాడు. […]