సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 28న హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సుమారు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణకు తక్షణమే రూ.10కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఉత్సవాల కమిటీ చైర్మన్, రాజ్యసభ […]