సారథి న్యూస్, మానవపాడు: తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు పుష్కర ఘాట్ భక్తుల తాకిడితో పులకరించింది. పుష్కరాలు ఆదివారానికి పదిరోజులు కావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఓ వైపు తుఫాన్.. మరోవైపు కరోనా ప్రభావం ఉన్నప్పటికీ భక్తులు అన్ని జాగ్రత్తులు తీసుకుంటూ పుణ్యస్నానాలు ఆచరించారు. పుల్లూరులో ఉన్న శివాలయం, కాలభైరవుడు సూర్యనారాయణ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్నారు.పుల్లూరు సర్పంచ్ నారాయణమ్మ తన కుటుంబసభ్యులతో ఆదివారం పుష్కర […]