సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ మార్కెట్చైర్మన్ప్రమాణ స్వీకారం శుక్రవారం ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది. మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అబ్రహం చేతులమీదుగా జరిపించారు. కార్యక్రమానికి పుల్లూరు గ్రామ సర్పంచ్ నారాయణమ్మను పిలువలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పదవి బాధ్యతల స్వీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా కార్యక్రమానికి సొంత పార్టీకి చెందిన జడ్పీటీసీ రాములమ్మ, ఎంపీటీసీ వరలక్ష్మి, ఎంపీపీని కూడా పిలువలేదు. దీంతో వారు కూడా కొంత మనస్తాపానికి […]