సామాజికసారథి, వెల్దండ: ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్- శ్రీశైలం హైవేపై మహేశ్వరం మండలం తుమ్మలూర్ వద్ద జరిగిన యాక్సిడెంట్ లో అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. బైకాని యాదయ్య(35), హెచ్.కేశవులు (35), మోత శ్రీను(30) మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లికి శనివారం తీసుకొచ్చారు. ఇమ్మరాజు రామస్వామి(36) మృతదేహాన్ని లింగారెడ్డిపల్లికి తరలించారు. నలుగురి డెడ్ బాడీస్ ఒకేసారి గ్రామానికి […]