సారథి న్యూస్, ఖమ్మం: కరోనా వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా వైద్యుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను మంగళవారం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించారు. లాక్ డౌన్ విధి నిర్వహణలో ఉంటున్న పోలీసు సిబ్బందికి ముందస్తు నియంత్రణ చర్యలలో భాగంగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, స్పెషల్ బ్రాంచ్ […]
సారథి న్యూస్, రంగారెడ్డి: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన తలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం పరిధిలోని వెల్జాల్ గ్రామంలోని గోవిందరాజుల గుట్ట దేవాలయంలో మాడుగుల మండలానికి చెందిన ముగ్గురు యువకులు గుప్త నిధుల కోసం తవ్వకాలు ప్రయత్నించారు. పక్క సమాచారం మేరకు గ్రామస్తులు, వారిని ట్టుకొని దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇందులో ఒకరు సస్పెండ్ అయిన కానిస్టేబుల్ ఉన్నాడు. ఆలయ […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం చర్ల ఇటిక్యాల గ్రామ శివారులో పేకాట శిబిరంపై నాగర్ కర్నూల్ సీఐ గాంధీనాయక్ ఆధ్వర్యంలో బుధవారం తాడూరు ఎస్సై నరేందర్, నాగర్ కర్నూల్ ఎస్సై మాధవరెడ్డి దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది అరెస్ట్ కాగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.67,800 నగదుతో పాటు పది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సారథి న్యూస్, రంగారెడ్డి (హయత్ నగర్): లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు దాతలు నక్క శ్రీనివాస్ యాదవ్, ఉమేష్ యాదవ్ సోదరులు మంగళవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణలో పోలీసుల పాత్ర ఎప్పటికీ మరువలేనిదన్నారు. కార్యక్రమంలో బాల్ రెడ్డి, సుధాకర్ యాదవ్, పాల్గొన్నారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా మహమ్మారి నిర్మూలనలో నిర్వీరామంగా పనిచేస్తున్న జిల్లా పోలీసు సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి నిర్ణయించారు. మంగళవారం ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నవోదయ, సుశ్రుత, నేహా సన్ షైన్ ఆస్పత్రుల్లో సిబ్బందికి జరుగుతున్న వైద్యపరీక్షల వివరాలను ఆరాతీశారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యమే ముఖ్యమని.. అందుకోసమే వారికి కూడా వైద్యపరీక్షలు చేస్తున్నామని ఏఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు.
సారథి న్యూస్, చేవెళ్ల: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ ఎంతో శ్రమటోడ్చి పనిచేస్తున్న పంచాయతీ కార్మికులతో పాటుచేవెళ్ల పోలీసు సిబ్బందికి పెంజర్ల అనంతరెడ్డి మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. కార్యక్రమాన్ని సోమవారం చేవెళ్ల సీఐ బాలకృష్ణ ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, దామోదర్‌రెడ్డి, నత్తి కృష్ణారెడ్డి, ఆగిరెడ్డి, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, కుంచం నవీన్, శ్రీకాంత్ రెడ్డి, కనక మామిడి రవిందర్ రెడ్డి పాల్గొన్నారు.